/ “ఓ ప్రజలారా! ధర్మములో హద్దులు మీరకండి. నిశ్చయంగా ధర్మములో హద్దులు మీరినందుకే మీ పూర్వికులు నాశనం అయినారు.”...

“ఓ ప్రజలారా! ధర్మములో హద్దులు మీరకండి. నిశ్చయంగా ధర్మములో హద్దులు మీరినందుకే మీ పూర్వికులు నాశనం అయినారు.”...

అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “అఖబా’ దినము ఉదయమున రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఒంటెపై కూర్చుని (నాతో) “కొన్ని గులకరాళ్ళు ఏరి ఇవ్వు” అన్నారు. నేను ఆయనకు ఏడు గులకరాళ్ళు ఏరి ఇచ్చాను. అవి విసరడానికి అనువుగా ఉన్న గులకరాళ్ళు. వాటిని తన చేతిలో అటూ ఇటూ కదుపుతూ ఆయన ఇలా అన్నారు: “వీటిని పోలిన వాటిని (గులకరాళ్ళను) మీరు (అఖబా పై) విసరండి.” ఆయన ఇంకా ఇలా అన్నారు: “ఓ ప్రజలారా! ధర్మములో హద్దులు మీరకండి. నిశ్చయంగా ధర్మములో హద్దులు మీరినందుకే మీ పూర్వికులు నాశనం అయినారు.”

వివరణ

ఈ హదీసులో - అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా హజ్జతుల్ విదాలో ‘యౌమున్నహర్’ దినమున (ఖుర్బానీ ఇచ్చే దినమున), జమరాతుల్ అఖబ పై గులకరాళ్ళు విసురు ఉదయము తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉన్నానని తెలియజేస్తున్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జమారాత్ పై విసరడానికి తన కొరకు గులకరాళ్ళు ఏరి ఇవ్వమని ఆయనను ఆదేశించినారు. అపుడు ఆయన ఏడు గులకరాళ్ళు ఏరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు ఇచ్చినారు. వాటిలో ఒకటి పెద్ద శనగ గింజంత, లేక బాదం గింజంత ఉన్నది. దానిని తన అరచేతిలో అటూఇటూ కదుపుతూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఈ పరిమాణములో ఉన్న దానిని (గులకరాయిని) విసరండి.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - ధర్మానికి సంబంధించిన విషయాలలో అతివాద ప్రవృత్తిని లేక కాఠిన్యాన్ని కలిగి ఉండరాదని, ధర్మములో విధించబడిన హద్దులు మీర కూడదని హెచ్చరించినారు, ఎందుకంటే పూర్వము గతించిన జాతులు, ధర్మము విషయములో హద్దులు మీరడం, అతిగా వ్యవహరించడం, మరియు కాఠిన్యాన్ని అవలంబించడం కారణంగా నాశనం చేయబడినాయని తెలియజేసినారు.

Hadeeth benefits

  1. ఇందులో ధర్మము విషయములో అతి చేయరాదని, తత్ఫలితంగా వచ్చే దాని పరిణామాలను గురించి తెలియజేయడం జరిగింది, అలాగే ధర్మము విషయములో అతి చేయడం అనేది వినాశనానికి దారి తీసే కారణాలలో ఒకటి అని తెలియజేయబడినది.
  2. గతించిన జాతుల వలన జరిగిన తప్పులు తిరిగి జరగకుండా ఉండుటకు గానూ, ఆ జాతుల (చరిత్ర)ను పరిగణన లోనికి తీసుకోవాలి.
  3. అలాగే ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ ను అనుసరించాలనే హితబోధ ఉన్నది.