/ “(ధర్మం విషయంలో) ‘హద్దుమీరేవారు నాశనమయ్యారు

“(ధర్మం విషయంలో) ‘హద్దుమీరేవారు నాశనమయ్యారు

అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “(ధర్మం విషయంలో) ‘హద్దుమీరేవారు నాశనమయ్యారు”. అలా మూడు సార్లు అన్నారు.
దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ఈ హదీసులో – (ధర్మం విషయంలో గానీ లేదా ప్రాపంచిక విషయంలో గానీ) ఇస్లాం విషయంలో హద్దులను ఉల్లంఘించి వ్యవహరించే వారు భంగపాటుకు, వైఫల్యానికి, ఆశాభంగానికీ గురి అవుతారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపుతున్నారు. అలాంటి వారు ధర్మం విషయంలో గానీ, తమ ప్రాపంచిక విషయాలలో గానీ, తమ సంభాషణల్లో గానీ లేదా తమ ఆచరణలలో గానీ సరియైన మార్గదర్శకత్వం లేక పోవటం వలననో, తగినంత ఙ్ఞానము లేక పోవటం వలననో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధించిన షరియత్ హద్దులను ఉల్లంఘిస్తారు.

Hadeeth benefits

  1. ఏ విషయం లో నైనా అతి చేయడం మరియు కపటత్వంతో ప్రవర్తించడం నిషేధించబడినవి. మరియు ప్రతి విషయంలోనూ అలాంటి వాటికి దూరంగా ఉండమని, ప్రత్యేకించి ధర్మంలోని ఆరాధనా విషయాలలో మరియు సత్పురుషులు, పుణ్యపురుషులను పొగిడే విషయంలో, కీర్తించే విషయంలో వాటికి దూరంగా ఉండమనే ఉద్బోధన ఇక్కడ కనిపిస్తున్నది.
  2. అల్లాహ్ యొక్క ఆరాధనలలో, అలాగే మరి ఇతర ప్రాపంచిక విషయాలలోనూ పరిపూర్ణత సాధించాలని కోరుకోవడం ప్రశంసనీయమైనదే. అయితే అది షరియత్ కు అనుగుణంగా, షిరయత్ కు లోబడి ఉండాలి.
  3. ముఖ్యమైన విషయాలు బాగా నిర్ధారణ కావడం కొరకు, ఒకటికి రెండు సార్లు నొక్కి చెప్పడం వాంఛనీయమైన విషయమే. ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకే వాక్యాన్ని మూడు సార్లు నొక్కి చెప్పారు.
  4. దీనిలో ఇస్లాం యొక్క ఔన్నత్యము మరియు సరళత్వము ప్రస్ఫుటమవుతున్నాయి.