- ఇందులో పూర్వనిర్ధిష్ఠాన్ని, మరియు భవితవ్యాన్ని ముందుగానే లిఖించబడి ఉండడాన్ని విశ్వసించుట తప్పనిసరి విధి అనే విషయం తెలుస్తున్నది.
- విధివ్రాత అంటే: అది, విషయాలు సృష్టించబడక పూర్వమే వాటి గురించి అల్లహ్ యొక్క ఙ్ఞానము; ఆయన ఇచ్ఛ, మరియు వాటిని ఆయన సృష్టించుట మొదలైనవి అన్నీ.
- ఈ భూమీ మరియు ఆకాశాలు సృష్టించబడక పూర్వమే ప్రతి విషయాన్ని గురించి చాలా వివరంగా వ్రాయబడి ఉంది అని (విధివ్రాతను) విశ్వసించడం, మనిషిలో ఒక రకమైన సంతృప్తిని, అల్లాహ్ పట్ల విధేయతను పెంపొందిస్తుంది.
- భూమ్యాకాశాల సృష్టికి ముందే అనంత కరుణామయుడైన అల్లాహ్ యొక్క సింహాసనం నీటి పైన ఉన్నది.