- మనిషిలో వాంఛలు ఎక్కువై పోవడానికి, పెరిగిపోతూ ఉండడానికి ఉన్న కారణాలలో ఒకటి, మనసు వాటి పట్ల ఆకర్షిత మయ్యేటంత వరకు చెడును, నిషేధిత విషయాలను (అసహ్యకరమైన విషయాలను సైతం) షైతాను అత్యంత సుందరమైనవిగా, మంచివిగా చేసి అతడి ముందు ప్రస్తుత పరచడం.
- ఇందులో, నిషిధ్ధ వాంఛల నుండి, నిషేధిత విషయాలనుండి దూరంగా ఉండాలనే ఆదేశం ఉన్నది. ఎందుకంటే అవి నరకానికి దారి తీస్తాయి. అలాగే చెడు విషయాల పట్ల (వాటికి మనసు లొంగి పోకుండా) సహనం వహించమనే ఆదేశం ఉన్నది. ఎందుకంటే అది స్వర్గానికి దారితీస్తుంది.
- ఇందులో - చెడుకు వ్యతిరేకంగా తన స్వయంతో పోరాడుట, అల్లాహ్ యొక్క ఆరాధనలో నిరంతరం నిలకడగా ఉండుట, అలాగే చెడు విషయాలకు (నిషిధ్ధ విషయాలకు) దూరంగా ఉండుటపై మరియు కఠిన పరిస్థితులను ఎదుర్కొనుటపై సహనం వహించుట – మొదలైన విషయాల ఘనత ఉన్నది.