/ “ఓ అల్లాహ్! నా ఉమ్మత్ కు (సమాజానికి) సంబంధించిన ఏ విషయములోనైనా ఎవరికైనా అధికారాన్ని ఇచ్చినట్లయితే, అతడు దాని ద్వారా ప్రజలను కష్టాలకు, కఠిన పరిస్థితులకు గురిచేస్తే, నీవు కూడా అతడిని కాఠిన్యానికి గురి చేయి. మరియు నా ఉమ్మత్ కు సంబంధించిన ఏ విష...

“ఓ అల్లాహ్! నా ఉమ్మత్ కు (సమాజానికి) సంబంధించిన ఏ విషయములోనైనా ఎవరికైనా అధికారాన్ని ఇచ్చినట్లయితే, అతడు దాని ద్వారా ప్రజలను కష్టాలకు, కఠిన పరిస్థితులకు గురిచేస్తే, నీవు కూడా అతడిని కాఠిన్యానికి గురి చేయి. మరియు నా ఉమ్మత్ కు సంబంధించిన ఏ విష...

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ఇంటిలో ఉన్నపుడు, ఒకరోజు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఓ అల్లాహ్! నా ఉమ్మత్ కు (సమాజానికి) సంబంధించిన ఏ విషయములోనైనా ఎవరికైనా అధికారాన్ని ఇచ్చినట్లయితే, అతడు దాని ద్వారా ప్రజలను కష్టాలకు, కఠిన పరిస్థితులకు గురిచేస్తే, నీవు కూడా అతడిని కాఠిన్యానికి గురి చేయి. మరియు నా ఉమ్మత్ కు సంబంధించిన ఏ విషయములోనైనా ఎవరికైనా అధికారాన్ని ఇచ్చినట్లయితే, అతడు (ప్రజలను కష్టాలపాలు చేయకుండా) ప్రజలతో దయతో, కరుణతో స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే, నీవు కూడా అతనిపై కృపతో, దయతో, అనుగ్రహముతో ఉండు”.
దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ఈ హదీసులో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దుఆ అందరికీ వర్తిస్తుంది. ఎవరైతే ముస్లిముల యొక్క వ్యవహారాలలో దేనినైనా నిర్వహించడానికి అధికారము పొందుతారో, అటువంటి వారందరికీ వర్తిస్తుంది. ఆ వ్యవహారము చిన్నదైనా లేక పెద్దదైనా, అది ప్రజలందరికీ సంబంధించిన వ్యవహారమైనా లేక ప్రజలలో కొద్ది మందికి (ఒక సమూహానికి, ఒక తెగకు మొ.) సంబంధించిన వ్యవహారమైనా – అందులో అతడు ప్రజలను కష్టాలకు గురిచేసినట్లయితే లేక వారిని కఠిన పరిస్థితుల పాల్జేసినట్లయితే, వారి పట్ల కనికరం, దయ లేకుండా వ్యవహరించినట్లయితే, (అధికార స్థానం’లో ఉండి) అతడు ప్రజలతో ఏవిధంగానైతే వ్యవహరించాడో అల్లాహ్ అతడికి అదే విధంగా ప్రతిఫలాన్నిస్తాడు. అలాగే ఇందులో, ఎవరైతే అధికారాన్ని పొందిన తరువాత, తద్వారా ప్రజలకు తగిన విధంగా సేవ చేస్తాడో, వారి వ్యవహారాలను న్యాయబధ్ధంగా పరిష్కరిస్తాడో, చక్కదిద్దుతాడో అల్లాహ్ కూడా అతడి వ్యవహారాలను కూడా అదే విధంగా పరిష్కరిస్తాడు.

Hadeeth benefits

  1. ఎవరైతే ముస్లింల యొక్క వ్యవహారాలలో దేనికైనా అధికారిగా నియమించబడితే, అతడు వారి పట్ల న్యాయపూరితంగా వ్యవహరించాలి, వారి పట్ల, కరుణ, దయ కలిగి ఉండాలి.
  2. అధికారం పొందిన తరువాత వారు దాని ద్వారా ఎలా వ్యవహరిస్తారో, అల్లాహ్ వద్ద వారి ప్రతిఫలం కూడా అదే విధంగా ఉంటుంది.
  3. అధికారం పొందిన తరువాత, ప్రజలతో న్యాయపూరితంగా, కనికరం, దయ, కరుణ కలిగి ఉండుటకు కొలమానం ఏమిటంటే, అది ఖుర్’ఆన్ మరియు సున్నత్ లకు విరుద్ధంగా, భిన్నంగా ఉండరాదు.