- చెడును అడ్డుకుని దానిని మార్చే సామర్థ్యపు స్థాయిలకు సంబంధించి ఈ హదీసు ఒక ప్రకటన వంటిది.
- ఇందులో చెడును అడ్డుకుని దానిని మార్చే సమర్థత, సామర్థ్యములకు సంబంధించి ఒక క్రమానుగతం కనిపిస్తుంది.
- చెడును అడ్డుకొనుట అనేది ధర్మములో ఒక ఉత్తమమైన అధ్యాయము వంటిది. అది ఒక ముస్లిం నుండి ఎన్నటికీ దూరం కాదు. కనుక తన శక్తి, సామర్థ్యము, సమర్థతలను అనుసరించి తన ఎదుట జరిగే చెడును అడ్డుకొనుట ప్రతి ముస్లిం యొక్క విధి.
- మంచి చేయమని ఆదేశించుట, చెడును నిరోధించు విశ్వాసపు ముఖ్య లక్షణాలు. మరియు విశ్వాసములో హెచ్చుతగ్గులు ఉంటాయి.
- చెడును నిరోధించడానికి అవసరమైన ముఖ్య విషయం ఏమిటంటే: అది చెడు అనే ఙ్ఞానము కలిగి ఉండుట.
- చెడును అడ్డుకుని దానిని మార్చే విషయానికి సంబంధించి ఒక ముఖ్య నియమం: అదేమిటంటే, ఒక చెడు దాని కంటే ఎక్కువ చెడుకు దారి తీయరాదు.
- చెడును అడ్డుకొనుట, దానిని ఆపుట అనేది ఒక విధానం ప్రకారం, కొన్ని నియమాలను అనుసరించి జరగాలి. ప్రతి ముస్లిం వాటిని నేర్చుకోవాలి.
- ఒక విషయాన్ని చెడుగా నిర్థారించి, దానిని నిరాకరించడానికి రాజకీయ విధానం, లోతైన అవగాహన మరియు ఙ్ఞానము అవసరం.
- మనస్సులోనైనా చెడును నిరాకరించక పోవడం – అది విశ్వాసపు బలహీనతను సూచిస్తుంది.