- ఇందులో అవిశ్వాసుల సమాజాన్ని, నీతిబాహ్యుల సమాజాన్ని అనుకరించడం పట్ల ఒక హెచ్చరిక ఉన్నది.
- అలాగే ధర్మవర్తనులైన వారిని అనుకరించమని, ధర్మం విషయంలో వారి ఉదాహరణలను అనుసరించమని ఉద్బోధ ఉన్నది.
- బాహ్యానుకరణ ఆ జాతి లేక సమూహం పట్ల ప్రేమను వారసత్వంగా వెంట తీసుకు వస్తుంది.
- ఇందులోని హెచ్చరిక మరియు పాపము - ఒక వ్యక్తి ఏ స్థాయిలో (ఎంత లోతుగా) ఆ సమూహాన్ని లేక ఆ జాతిని అనుకరించినాడు లేక అనుకరిస్తున్నాడు అనే దానిని బట్టి అతడు పొందుతాడు.
- వారికి మాత్రమే ప్రత్యేకమైన అవిశ్వాసుల ధర్మాన్ని, వారి ధార్మిక ఆచార వ్యవహారాలను అనుకరించడం నిషేధించబడింది. అయితే వారికి మాత్రమే ప్రత్యేకం కాని ఇతర విషయాలను అనుకరించడం, అనుసరించడం ఈ నిషేధం క్రిందకు రావు. ఉదాహరణకు చేతిపనుల వంటి వాటిని అనుకరించడం, నేర్చుకోవడం, వారి సాంకేతిక విషయాలను అనుకరించడం, నేర్చుకోవడం మొదలైనవి.