- దివ్య ఖుర్’ఆన్ లో విస్పష్టమైన (అల్-ముహ్’కమ్) ఆయతులు: వీటి ప్రాముఖ్యతలో గాని, లేక వీటి అర్థములో గానీ ఎటువంటి సందేహము, లేక అస్పష్టత ఎంత మాత్రమూ లేనటువంటి ఆయతులు.
- దివ్య ఖుర్’ఆన్ లో అస్పష్టమైన (అల్-ముతషాబిహ్) ఆయతులు: ఇవి ఒకటి కంటే ఎక్కువ అర్థాలను కలిగి ఉండే ఆయతులు. వీటిని అనుసరించడానికి, వీటిని గురించి నేర్చుకోవడానికి సరియైన అవగాహన, ఆలోచన, పరిఙ్ఞానము అవసరం.
- ఇందులో – ఎవరి హృదయాలలోనైతే వక్రత ఉన్నదో వారితో, మరియు మోసపూరిత వ్యక్తులతో కలవడం, వారి సాంగత్యములో కూర్చొనుట చేయరాదని, అలాగే (ధర్మానుసరణలో) ప్రజలకు కష్టాలను కలుగజేసే వారితోనూ, వారిలో సందేహాలు, అనుమాలు రేకెత్తించే వారితోనూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక ఉన్నది.
- ఆయతు చివరన సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అన్నాడు {జ్ఞానవంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు} అని. దీని ద్వారా అల్లాహ్ హృదయాలలో వక్రత ఉన్నవారిని బహిర్గతం చేసాడు, మరియు ధర్మానుసరణలో స్థిరపాదులై ఉన్నవారిని ప్రశంసించినాడు. అంటే, సరియైన అవగాహన, ఆలోచన, పరిఙ్ఞానముల సహాయంతో కాకుండా తమ మనసుకు నచ్చిన విధంగా భాష్యం చెప్పే వారు ఙ్ఞానవంతుల పరిధిలోని వారు కారు.
- హృదయాలలో వక్రత జనించడానికి కారణాలలో, సరియైన అవగాహన, ఆలోచన, పరిఙ్ఞానము లేకుండా అస్పష్ట విషయాల వెంట పడుట ఒకటి.
- దివ్య ఖుర్’ఆన్ లో అస్పష్టమైన ఆయతులను అర్థం చేసుకోవడానికి, వాటిని మూల స్తంభాలవంటి విస్పష్టమైన ఆయతుల వైపునకు మరలించుట (వాటి దిశా నిర్దేశములో ఆ ఆయతులను అర్థం చేసుకొనుట) ప్రతివారిపై విధి.
- దివ్య ఖుర్’ఆన్ లో కొన్ని విస్పష్టమైన ఆయతులు, మరికొన్ని స్పష్టత లేని ఆయతులు ఉండుట అనేది స్థిరపరిఙ్ఞానము గల విశ్వాసులను మరియు అపమార్గము పాలైన వారిని గుర్తించడానికి ప్రజల కొరకు ఒక పరీక్ష వంటిది.
- దివ్య ఖుర్’ఆన్ లో అస్పష్టమైన ఆయతుల ఉనికి: ఇది సాధారణ ప్రజలపై ఙ్ఞానవంతుల ఔన్నత్యాన్ని చాటి చెపుతుంది. అలాగే మానవుని బుద్ధి ఎంత లోపభూయిష్టమైనదో తెలియజేస్తుంది. కనుక (మానవుడు) తన అశక్తతను గ్రహించి అన్నివేళలా తన సృష్టికర్త విధేయతలో ఉండాలనే సూచన ఉన్నది.
- ఇందులో - ఙ్ఞానములో స్థిరపాదులై ఉండుట యొక్క ఘనత మరియు దాని యొక్క అవసరం తెలుస్తున్నది.
- ఆయతులో {వాటి అసలు అర్థం అల్లాహ్‌కు మరియు పరిపక్వ జ్ఞానం గలవారికి తప్ప మరెవ్వరికీ తెలియదు} అనే భాగముపై దివ్య ఖుర్’ఆన్ విశ్లేషకుల పక్షమునకు సంబంధించి రెండు విషయాలు ఉన్నాయి: ఎవరైతే ‘అల్లాహ్’కు తప్ప’ అనే పదం వద్ద ఆగుతారో, దాని అర్థం ఏమిటంటే; కొన్ని విషయాలు ఎటువంటివి అంటే వాటి వాస్తవిక ఙ్ఞానమును అర్థం చేసుకోవడానికి మనవద్ద మరింకే సాధనం కూడా లేనటువంటివి (అంటే వాటి సంపూర్ణ ఙ్ఞానము కేవలం అల్లాహ్ వద్దనే ఉంటుంది). ఉదాహరణకు ఆత్మ మరియు దానికి సంబంధించిన ఆఙ్ఞలు, ఆదేశాలు, ఇంకా ప్రళయ ఘడియ ను గురించిన ఙ్ఞానము. ఎవరైతే ధార్మిక ఙ్ఞానములో స్థిరపాదులై ఉంటారో వారు దీనిని విశ్వసిస్తారు, ఈ విషయాల ఙ్ఞానమును అల్లాహ్’కు మాత్రమే వదిలి వేస్తారు. ఆవిధంగా అల్లాహ్ కు విధేయత ప్రకటించి విధేయులై ఉంటారు. అలాగే ఎవరైతే ‘అల్లాహ్’కు తప్ప’ అనే పదం వద్ద ఆగకుండా ముందుకు సాగుతారో, దాని అర్థము: ఆయతుల అర్థము, భావము మరియు వివరణ – వీటి యొక్క ఙ్ఞానము అల్లాహ్ వద్ద ఉంటుంది మరియు ఆయన ఎవరినైతే ఎంచుకుంటాడొ, అటువంటి ఙ్ఞానవంతులకు, ఉలమాలకు, విద్వాంసులకు కూడా ఉంటుంది. వారు స్పష్టత లేని ఆయతులను మూల స్తంభాల వంటి విస్పస్టమైన ఆయతుల వైపునకు మరలించి వాటి దిశా నిర్దేశములో ఆ ఆయతులను అర్థం చేసుకుంటారు.