/ ఎవరైతే ఒక మంచి వైపునకు మార్గదర్శకం చేస్తారో, అతనికి ఆ మంచి పనిని ఆచరించిన వానితో సమానంగా ప్రతిఫలం లభిస్తుంది...

ఎవరైతే ఒక మంచి వైపునకు మార్గదర్శకం చేస్తారో, అతనికి ఆ మంచి పనిని ఆచరించిన వానితో సమానంగా ప్రతిఫలం లభిస్తుంది...

అబీ మస్'ఊద్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : "ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి "నేను సవారీ చేసి వచ్చిన జంతువు చనిపోయింది. కనుక నాకొక సవారీ జంతువును సమకూర్చండి" అన్నాడు. దానికి ఆయన "నా వద్ద (జంతువు) లేదు" అన్నారు. ఒక వ్యక్తి (లేచి) "ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికైతే ఇతనికి సవారీ జంతువును ఇవ్వగలగే స్తోమత ఉన్నదో, ఇతణ్ణి అతని వద్దకు మార్గదర్శకం చేస్తాను" అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం "ఎవరైతే ఒక మంచి వైపునకు మార్గదర్శకం చేస్తారో, అతనికి ఆ మంచి పనిని ఆచరించిన వానితో సమానంగా ప్రతిఫలం లభిస్తుంది" అన్నారు.
దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ఈ హదీసు ద్వారా మనకు తెలుస్తున్న విషయాలు: ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి "నేను సవారీ అయి వచ్చిన జంతువు చనిపోయింది. కనుక నాకొక సవారీ జంతువును సమకూర్చండి" అని అర్థించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం అతడిని క్షమించమని అన్నారు, ఎందుకంటే ఆయన వద్ద అతడికి సవారీగా ఇవ్వడానికి ఏమీ లేదు కనుక. అక్కడే హాజరై ఉన్నవారిలో ఒకతను "ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వ సల్లం, నేను ఇతనికి సవారీ జంతువును ఎవరు ఇవ్వగలరో ఆయనను చూపిస్తాను" అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం "మంచిపని చేసే వానితో పాటు (సవారీ జంతువును ఇచ్చే వానితో పాటు) ఇతడు కూడా పుణ్యఫలం లో భాగస్వామి అవుతాడు, ఎందుకంటే, అగత్యపరుణ్ణి అతని అవసరం తీర్చే వాని వైపునకు మార్గదర్శనం చేసినాడు కనుక" అన్నారు.

Hadeeth benefits

  1. ఇందులో మంచి వైపునకు మార్గదర్శకం చేయాలి అనే ఉద్బోధ ఉన్నది.
  2. మంచి చేయుటను ప్రోత్సహించుట ముస్లిం ఉమ్మత్ సమైక్యత, సంఘీభావము పెంపొందించు కారణాలలో ఒకటి.
  3. దీని ద్వారా అల్లాహ్ యొక్క అపారమైన కరుణ, కృపా తెలుస్తున్నాయి.
  4. ఈ హదీసులో ఉన్నది సాధారణ నియమం. ఇందులో అన్నీ మంచి పనులు ఇమిడి ఉన్నాయి.
  5. ఒకవేళ అగత్యపరుని అవసరాన్ని తీర్చలేని స్థితిలో ఉంటే, అగత్య పరుణ్ణి అతడి అవసరం తీరే మార్గం వైపునకు మార్గదర్శకం చేయాలి.