- ఇందులో మంచి చేయమని ఆదేశించడం మరియు చెడును నిషేధించడం యొక్క ప్రాధాన్యత తెలుస్తున్నది.
- ఉదాహరణలు మరియు ఉపమానాల ద్వారా విషయాన్ని బోధించే పద్ధతి, విషయం యొక్క అర్థాన్ని, భావాన్ని సాకారంగా మనసుకు అర్థం అయ్యేలా చేస్తుంది.
- నిరోధం , హద్దులు లేకుండా బాహాటంగా చేయబడే చెడు అతి ప్రమాదకరం, అది అందరికీ హాని కలుగజేస్తుంది.
- దుష్కార్యాలకు, దుర్మాగానికి పాల్బడే వారిని అలాగే వదిలి వేయడం సమాజపు వినాశానికి దారితీస్తుంది. వారు భూమిపై అరాచకత్వాన్ని సృష్టిస్తారు.
- చెడు నడత మరియు మంచి సంకల్పము – ఇవి మంచి పని చేయడానికి ఎన్నడూ సరిపోవు.
- ముస్లిం సమాజంలో బాధ్యత అనేది పంచుకోబడుతుంది – ఎవరో ఒక్కరిపై మోపబడదు.
- ప్రైవేటుగా జరిగే పాపాలు నిరోధించబడకపోతే, అవి ప్రజలకు హింసగా అవుతాయి.
- పాపపు పనులకు, దుష్ట కార్యాలకు ఒడిగట్టేవారు కపటులు చేసే మాదిరిగా తమ చెడును సమాజానికి చేస్తున్న మంచిగా చూపిస్తారు.