- ఈ హదీథులో సన్మార్గము వైపునకు ఆహ్వానించుట అనే ఆచరణ, అది చిన్నదైనా, లేక పెద్దదైనా, దాని యొక్క ఘనత తెలుస్తున్నది, మరియు ఆహ్వానించు వాని కొరకు – ఆ మార్గమును అనుసరించి ఆచరించిన వాని పుణ్యాన్ని పోలిన పుణ్యము ఉంది. అది (తన దాసులపై) అల్లాహ్ యొక్క అనంతమైన కృప, అనుగ్రహం మరియు పరిపూర్ణమైన కరుణ.
- అలాగే ఇందులో మార్గభ్రష్టత్వము వైపునకు ఆహ్వానించుట ఎంత ప్రమాదకరమైన విషయమో తెలుస్తున్నది; అది చిన్నదైనా లేక పెద్దదైనా. ఆహ్వానించు వానిపై – ఆ మార్గమును అనుసరించి ఆచరించిన వాని భారమంతా ఉంటుంది.
- ప్రతిఫలం ఎప్పుడూ ఆచరణను పోలి ఉంటుంది. ఎవరైతే మంచి వైపునకు, శుభం వైపునకు ఆహ్వానిస్తాడో – దానిని ఆచరించిన వాని ప్రతిఫలానికి సమానమైన ప్రతిఫలం అతనికి కూడా లభిస్తుంది; అలాగే ఎవరైతే చెడు వైపునకు, కీడు వైపునకు ఆహ్వానిస్తాడో – దానిని ఆచరించిన వాని పాపభారం వంటిదే అతనిపై కూడా పడుతుంది, దానికి (ఆ కీడు, లేక చెడుకు) సమానమైన ప్రతిఫలం దాని వైపునకు ఆహ్వానించిన వానికి లభిస్తుంది.
- బహిరంగంగా గానీ చాటుగా గానీ పాపపు పనులకు పాల్బడడం నుంచి దూరంగా ఉండాలి. ఒక ముస్లిం ప్రజలు తనను గమనిస్తున్నారని, వారు తనను అనుకరించే ప్రమాదం ఉన్నదన్న విషయం గుర్తుంచుకోవాలి. తాను పాపపు పనులకు పాల్బడడం చూసి ఎవరైనా ఆ పనులకు పాల్బడితే, ఆ భారమంతా ఇతనిపై ఉంటుంది – వారిని ఆ పాపపు పనులకు పాల్బడేలా నేరుగా ప్రోత్సహించకపోయినా సరే.