- వర్షం కురిసిన తరువాత వాంఛనీయమైన విషయం ఏమిటంటే – ‘అల్లాహ్ అనుగ్రహం వలన, కరుణ వలననే మనపై వర్షం కురిసింది’ అనడం.
- ఎవరైతే వర్షం కురవడం ఇంకా అటువంటి ఇతర అనుగ్రహాలు కలగడాన్ని, అవి సృష్టించబడడాన్ని మరియు ఉనికిలోనికి రావడాన్ని పూర్తిగా గ్రహాలకు ఆపాదిస్తాడో అతడు ‘కాఫిర్’ (అవిశ్వాసి). అతడు ఘోరమైన అవిశ్వాసానికి పాల్బడినవాడు అవుతాడు. మరియు గ్రహాలను ఒక కారణంగా చూస్తాడో అతడు తక్కువ స్థాయి అవిశ్వాసానికి పాల్బడినవాడు అవుతాడు, ఎందుకంటే అలా భావించడం షరియత్’కు అనుగుణమైనదీ కాదు లేక అది ఙ్ఞానవంతమైన విషయమూ కాదు.
- (వర్షం కురియుట మొదలైన ఇతర) అనుగ్రహాలు అనేవి అవిశ్వాసానికి దారి తీస్తాయి - ఒకవేళ వాటిని అల్లాహ్ అనుగ్రహాలుగా విశ్వసించక పోయినట్లయితే;
- అలాగే విశ్వాసానికి, కృతజ్ఞతకు, విధేయతకు దారితీస్తాయి - ఒకవేళ వాటిని అల్లాహ్ అనుగ్రహాలుగా విశ్వసించినట్లయితే.
- “ఫలానా తుఫాను కారణంగా వర్షం కురిసింది” లాంటి మాటలు అనడం కూడా నిషేధం; అవి నిజానికి ఆ సమయాన్ని సూచించే పదాలే అయినప్పటికీ. ఇది “షిర్క్” యొక్క మార్గాలను (అల్లాహ్ అన్ని విషయాల విధాత కావడంలో వేరే కారణాలను కూడా ఆయనకు సమానంగా నిలబెట్టడాన్ని) మొదట్లోనే నిరోధిస్తుంది, మూసివేస్తుంది.
- హృదయం అన్ని వేళలా సర్వోన్నతుడైన అల్లాహ్’తో అనుసంధానం అయి ఉండేలా చూసుకోవడం ప్రతి విశ్వాసి యొక్క విధి. అది అతనిపై అనుగ్రహాలు కురిపిస్తుంది, మరియు ఆపదలను, విపత్తులను దూరం చేస్తుంది.