- సోది చెప్పుట, జ్యోస్యము చెప్పుట, జ్యోతిష్కము మొదలైనవి హరాం (నిషేధము), అలాగే అటువంటి వారిని అగోచర విషయాలను గురించి (ఉదా: భవిష్యత్తును గురించి) ప్రశ్నించుట కూడా నిషేధమే.
- ఒక వ్యక్తి అవిధేయతకు పాల్బడుట అనేది, అతడు విధేయునిగా ఆచరించిన ఆచరణల ప్రతిఫలము నుంచి అతడిని దూరం చేస్తుంది.
- జాతకాలు చూడడం, రాశిఫలాలు చూడడం, హస్తసాముద్రికం, కప్పులో పోసిన కాఫీ పొగలను చూస్తూ భవిష్యత్తు చెప్పడం, అటువంటి వారి దగ్గరకు వెళ్ళడం – అది కేవలం సరదాకే అయినా లేదా ఏమి చెపుతారో చూద్దాం అనే ఆసక్తితో అయినా – ఈ హదీథు పరిధి లోనికే వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ అగోచర ఙ్ఞానాన్ని కలిగి ఉండుటను గురించి దావా చేయడం, భవిష్యత్తు గురించి చెప్పడంచెప్పడం మొదలైన వాటిలోని భాగాలే.
- జ్యోతిష్కుని దగ్గరకు వెళ్ళినందుకే అల్లాహ్ తరఫున ఇంత ఘోరమైన శిక్ష ఉంటే, మరి అటువంటి జ్యొతిష్కులు, బాబాలు, మొదలైన వారి శిక్షను గురించి ఊహించను కూడా ఊహించలేము.
- అయితే ఆ నలభై దినాల నమాజులు సరియైనవి గానే భావించ బడతాయి, అయితే ఆ నమాజులకు పుణ్యఫలం ఏమీ లభించదు.