- ఎదుటి వ్యక్తి అడగకపోయినా, విషయపు ప్రాధాన్యతను నొక్కి చెప్పడానికి, ప్రమాణం చేసి మరీ చెప్పవచ్చు అనడానికి ఇందులో ఆధారం ఉన్నది.
- ప్రమాణం చేసిన తర్వాత “ఇన్ షా అల్లాహ్” ("అల్లాహ్ కోరుకుంటే") అని చెప్పడం ద్వారా మినహాయింపు ఇవ్వడం అనుమతించబడిన విషయమే. ఆ మినహాయింపు, చేసిన ప్రమాణానికి చెందినది అయి ఉండి, దానికి అనుసంధానించబడి ఉంటే, తన ప్రమాణాన్ని ఉల్లంఘించిన వ్యక్తి ప్రాయశ్చిత్తం చేయవలసిన అవసరం లేదు (పరిహారం చెల్లించవలసిన అవసరం లేదు).
- అలాగే ఈ హదీసులో, ప్రమాణం చేసిన వ్యక్తి, ఒకవేళ అతడు తాను ప్రమాణం చేసిన దాని కంటే మెరుగైన దానిని చూసినట్లయితే, ఆ మెరుగైన విషయం కొరకు, చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించవచ్చు అనే ప్రోత్సాహం ఉన్నది. అయితే ఆ వ్యకి, ప్రమాణాన్ని ఉల్లంఘించినందుకు పరిహారం చెల్లించాలి.