- కేవలం అల్లాహ్ నందు విశ్వాసముంచి, ఆయన అభీష్ఠము మరియు పూర్వ నిర్దిష్ఠాన్ని విశ్వసించడం ప్రతి ముస్లిం యొక్క విధి. అలాగే శకునాలను విశ్వసించడం, చేతబడి, సోదీ, జోస్యము మొదలైనవి చేయడం లేదా చేయించడం, వాటిని విశ్వసించడం హరాం (నిషేధము) అని తెలుస్తున్నది.
- అగోచర విషయాల ఙ్ఞానము తనకు ఉందని దావా చేయడం ‘షిర్క్’ (బహుదైవారాధన) అవుతుంది, అది ‘తౌహీద్’ కు పూర్తిగా వ్యతిరేకం. (తౌహీద్ అంటే అల్లాహ్ ఒక్కడే సకల ఆరాధనలకు అర్హుడు అని విశ్వసించడం, సకల విషయాలపై ఆయనే ఆధిపత్యము గలవాడు అని విశ్వసించడం) .
- జోతిష్కులను విశ్వసించడం, వారి వద్దకు వెళ్ళడం నిషేధించబడినవి. అలాగే హస్తసాముద్రికం (చేతిలోని రేఖలు చూసి భవిష్యత్తు చెప్పడం), వారఫలాలు, రాశిచక్రము చూచుట, వాటిని విశ్వసించుట – అది కేవలం వినోదం కొరకు లేదా కేవలం ‘అతడు ఏమి చెపుతాడో విందాం’ లేక అందులో ఏమి రాసి ఉందో చూద్దాం’ అనే ఉద్దేశ్యంతో చేసినా – అది హరాం (నిషేధం).