- ఎవరైతే అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ఆధారపడతాడో, అల్లాహ్ అతనికి అతను ఉద్దేశించిన దానికి విరుద్ధంగా ఇస్తాడు.
- చెడును లేదా కీడును దూరం చేయడానికి ‘తాయత్తు’ ఒక సాధనం అని విశ్వసించినట్లయితే అది ‘షిర్క్ అస్సఘీర్’ (చిన్నపాటి బహుదైవారాధన) అవుతుంది; అలాకాక తాయత్తు స్వయంగా చెడును లేదా కీడును దూరం చేస్తుంది అని విశ్వసించినట్లైయి అది ‘షిర్క్ అక్బర్’ (పెద్ద బహుదైవారాధన) అవుతుంది.