- ఈ హదీసు ద్వారా సజీవుల చిత్రాలను, శిల్పాలను, మూర్తులను, ప్రతిమలను గీయడం, తయారు చేయడం, నిర్మించడం మొదలైనవి అన్నీ నిషేధము అని తెలుస్తున్నది. ఎందుకంటే అవి షిర్క్ నకు (బహుదైవారాధనకు) దారితీస్తాయి.
- ఎవరైతే అధికారములో ఉన్నారో లేదా అధికారము కలిగి ఉన్నారో వారు, ఏదైనా కీడు కలిగించే దానిని లేదా ఏదైనా హాని కలిగించే దానిని తమ చేతులతో తొలగించవచ్చును – అది న్యాయసమ్మతమే అనే విషయము తెలుస్తున్నది.
- ‘జాహిలియ్యహ్ కాలము’ (ఇస్లాంకు పూర్వ కాలము) నాటి బహుదైవారాధనకు చెందిన లేదా బహుదైవారాధనకు దారి తీసే ప్రతి చిహ్నాన్ని, సంకేతాన్ని – ఉదాహరణకు, చిత్రపటాలు, శిల్పాలు, మూర్తులు, ప్రతిమలు, అలాగే ఎత్తుగా నిర్మించబడిన సమాధులు లేదా సమాధులపై నిర్మించబడి ఉన్న కట్టడాలు మొదలైన వాటిని తొలగించుటలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చురుకుగా ఉండేవారు.