- ప్రమాణం చేయడం ద్వారా వ్యక్తమయ్యే ఘనత, ఔన్నత్యము – అది కేవలం పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ యొక్క హక్కు. కనుక అల్లాహ్ పై, ఆయన శుభనామములపై లేక ఆయన గుణగణాలపై తప్ప మరింకెవరిపైనా ప్రమాణం చేయరాదు.
- మంచి చేయమని ఆదేశించుటలో, చెడును నిరోధించుటలో సహాబాలు ఎక్కువ శ్రధ్ధ వహించేవారు. ప్రత్యేకించి ఆ చెడు అల్లాహ్ కు సాటి కల్పించే విషయానికి (షిర్క్ కు) మరియు అల్లాహ్ పట్ల అవిశ్వాసానికి (కుఫ్ర్ కు) సంబంధించినది అయితే దానిని నిరోధించుటలో ఇంకా ఎక్కువ శ్రధ్ధ వహించేవారు.