- ఈ హదీథు ద్వారా అబూ బక్ర్ అస్సిద్దీఖ్ రజియల్లాహు అన్హు యొక్క ఘనత; ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులలో ఆయన అత్యుత్తముడని మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణం తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్తరాధికారిగా ప్రజలలో అత్యంత యోగ్యుడైన వ్యక్తి ఆయనేనని నిర్ద్వంద్వంగా స్పష్టమవుతున్నది.
- సమాధులపై మస్జిదులు నిర్మించుట గతించిన తరాల వారి భ్రష్ఠకార్యాలలో ఒకటి అనే విషయం తెలుస్తున్నది.
- సమాధులను ఆరాధనా గృహాలుగా చేసుకొనుట, వాటి వద్ద సలాహ్ (నమాజు) ఆచరించుట లేదా వాటి వైపు ముఖము చేసి సలాహ్ ఆచరించుట లేదా వాటిపై మస్జిదులను నిర్మించుట లేదా వాటిపై గుంబదులను నిర్మించుట ఇవన్నీ నిషేధించబడినవి. ఈ కారణాలలో ఏ ఒక్క దాని వలన నైననూ షిర్క్ లో (బహుదైవారాధనలో) పడిపోకుండా జాగ్రత్త వహించాలి.
- ఇందులో సత్పురుషుల పట్ల గౌరవం విషయంలో హద్దుమీరిపోవడం అనేది ‘షిర్క్’నకు (బహుదైవారాధనకు) దారి తీస్తుందనే హెచ్చరిక ఉన్నది.
- (తీవ్రమైన అనారోగ్యములో ఉండి కూడా) తన మరణానికి ఐదు దినముల ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి ఇంతగా నొక్కి చెప్పడమనేది ఈ విషయం మన కొరకు ఎంత గంభీరమైన విషయమో తెలియ జేస్తున్నది.