- నిశ్చయంగా అల్లాహ్, మన ఆచరణలలో కేవలం ఆయన కొరకు (ఆయన కరుణ, కృప ఆశించి) చేసే ఆచరణలను మాత్రమే స్వీకరిస్తాడు. కనుక వాటిలో స్వచ్ఛత, నిజాయితీ కలిగి ఉండాలనే ప్రోద్బలం, ఉద్బోధ కనిపిస్తుంది ఇందులో.
- మహోన్నతుడూ, సర్వశక్తిమంతుడు అయిన అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే ఆచరణలను (ఉదాహరణకు, సత్కార్యాలు, మంచి పనులు), ఏదైనా నిర్బంధం కారణంగానో లేదా అలవాటుగానో ఆచరించినట్లయితే, వాటికి గానూ అతడికి పుణ్యఫలం ఏమీ లభించదు, అందులో అల్లాహ్ యొక్క సామీప్యము, ఆయన కరుణ, కృప పొందే సంకల్పము లేనంతవరకు.