- ‘అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు’ అని సాక్ష్యం పలకడం, ‘ఆరాధనలకు అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే’ అని అల్లాహ్ ను ప్రత్యేకపరుస్తుంది. మరియు అందులోనే ఆయనను తప్ప ఇంకెవరినైనా ఆరాధించడాన్ని త్యజించాలనే సూచన కూడా ఉంది.
- “ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు” అని సాక్ష్యం పలకడం అంటే, ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడని విశ్వసించడం; ఆయనపై అవతరింపజేయబడిన దానిని (ఖుర్’ఆన్ ను) విశ్వసించడం మరియు ఆమోదించడం; మరియు ఆయన మానవాళి కొరకు పంపబడిన ఆఖరి ప్రవక్త అని విశ్వసించడం – ఇవన్నీ ఆ సాక్ష్యం పరిధిలోనికే వస్తాయి.
- ఙ్ఞానం కలిగిన వారితో ఏదైనా విషయాన్ని గురించి మాట్లాడడం మరియు అఙ్ఞానులతో మాట్లాడడం (ఆ విషయాన్ని గురించి ఏమీ తెలియని వారితో మాట్లాడడం) రెండూ సమానం కావు. అందుకనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఆద్ రజియల్లాహు అన్హు ను “నిశ్చయంగా, నీవు ఇప్పుడు గ్రంథావహులైన జాతి (ప్రజల) వద్దకు వెళుతున్నావు” అని హెచ్చరించినారు.
- సందేహాలు రేకింత్తించే వారి సందేహాలను పటాపంచలు చేయడానికి, ఒక ముస్లిం కొరకు తన ధర్మానికి సంబంధించిన ఙ్ఞానము కలిగి ఉండడం అత్యంత ముఖ్యమైన విషయం మరియు అత్యంత అవసరం అని తెలుస్తున్నది.
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఆద్ రజియల్లాహు అన్హు ను యమన్ ప్రజలకు ఇస్లాం ను గురించి బోధించుటకు ప్రత్యేకించి పంపించడం అనేది "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆగమనం తరువాత, క్రైస్తవుల మరియు యూదుల ధర్మాలు నిరర్ధకమైనవని, నిష్ప్రయోజనకరమైనవని, వారు ఇస్లాం ను స్వీకరించనంత వరకు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త అని విశ్వసించనంత వరకు పునరుథ్థాన దినమున వారు (నరకాగ్ని నుండి) రక్షించబడిన వారితో పాటు ఉండరు" అని తెలియజేస్తున్నది.