- ఇస్లాం స్వీకరించి దానిలోనికి ప్రవేశించడానికి ప్రధాన షరతు (Condition) ఏమిటంటే “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని (మనస్పూర్తిగా నమ్ముతూ, నాలుకతో ఉచ్ఛరిస్తూ) సాక్ష్యము పలుకుట, మరియు అల్లాహ్ ను తప్ప ఆరాధించబడే ప్రతి దానినీ నిరసించుట.
- “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప నిజ అరాధ్యూడెవరూ లేరు) యొక్క అర్థములోనే, ఆయనను తప్ప ఆరాధించబదే ప్రతి దానినీ నిరసించడం (అవిశ్వసించడం) ఉన్నది, అంటే ఉదాహరణకు: శిల్పాలు, బొమ్మలు, సమాధులను పూజించడం వగైరా.
- ఎవరైతే “తౌహీదు” ను (అంటే కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుటను) మరియు దానికి సంబంధించిన నియమాలను, చట్టాలను బాహ్యంగా అంటిపెట్టుకుని ఉంటాడో, ఆ విధంగా ఉండడం అతని కొరకు విధి అయిపోతుంది – దానికి వ్యతిరేకంగా అతని నుండి మరింకే ఆచరణ ప్రస్ఫుటం కానంత వరకు.
- ఇస్లామీయ చట్టము ప్రకారము తప్ప, ఒక ముస్లిం యొక్క సంపద మరియు అతని రక్తము మిగతా విశ్వాసుల కొరకు హరాం (నిషేధము).
- ఈ ప్రపంచములో తీర్పు (నిర్ణయం) బాహ్యంగా ప్రస్పుటమయ్యే విషయాల ఆధారంగానే ఉంటుంది. తీర్పుదినమున సంకల్పాలను అనుసరించి మరియు అతని లక్ష్యాలను అనుసరించి ఉంటుంది.