- దుఆ చేయుట అనునది ఒక ఆరాధన, అది కేవలం సర్వోన్నతుడైన అల్లాహ్ కు మాత్రమే చేయదగిన ఆరాధన.
- ఇది ‘తౌహీద్’ (అల్లాహ్ ఒక్కడే అని విశ్వసించుట) యొక్క ఘనత. ఎవరైతే తౌహీద్ పైనే మరణిస్తాడో అతడు స్వర్గములోనికి ప్రవేశిస్తాడు; అతడు పాల్బడిన కొన్ని పాపకార్యాల కొరకు శిక్షించబడినా సరే.
- అలాగే ‘షిర్క్’ (బహుదైవారాధన) ఎంత ప్రమాదకరమైనదో తెలుస్తున్నది. ఎవరైతే ‘షిర్క్’ పైనే మరణిస్తాడు అతడు నరకాగ్నిలోనికి ప్రవేశిస్తాడు.