/ “విశ్వాసము డెభ్భై శాఖలు కలిగి ఉంటుంది లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహుశా 60 శాఖలు కలిగి ఉంటుంది (అన్నారు). వాటిలో అత్యుత్తమమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు); మరియు అన్నింటికన్నా చివర...

“విశ్వాసము డెభ్భై శాఖలు కలిగి ఉంటుంది లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహుశా 60 శాఖలు కలిగి ఉంటుంది (అన్నారు). వాటిలో అత్యుత్తమమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు); మరియు అన్నింటికన్నా చివర...

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “విశ్వాసము డెభ్భై శాఖలు కలిగి ఉంటుంది లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహుశా 60 శాఖలు కలిగి ఉంటుంది (అన్నారు). వాటిలో అత్యుత్తమమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు); మరియు అన్నింటికన్నా చివరిది (తక్కువ స్థాయి శాఖ) ప్రజలు నడిచే దారి నుండి ప్రమాదకరమైన దానిని తొలగించుట. అలాగే అణకువ, నమ్రత, బిడియము – విశ్వాసపు శాఖలలో ఒకటి.”
ముత్తఫిఖ్ అలైహి

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – విశ్వాసము అనేక శాఖలుగా, అనేక శ్రేణులుగా ఉంటుందని, అది విశ్వాసములు, ఆచరణలు మరియు వాక్కులతో కూడి ఉంటుందని తెలియజేస్తున్నారు. విశ్వాసములలో ఉత్తమ స్థాయి మరియు ఉత్తమ శ్రేణి విశ్వాసము: “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు) అని పలుకుట, దాని అర్థాన్ని, భావాన్ని గ్రహించుట, దానికి అనుగుణంగా ఆచరించుట – అంటే కేవలం అల్లాహ్ మాత్రమే ఏకైక నిజ ఆరాధ్యుడు అని, ఆయన మాత్రమే ఆరాధనలకు అర్హుడు అని, ఆయన తప్ప మరింకెవ్వరూ లేరు అని మనసా, వాచా, కర్మణా తెలుసుకొనుట, గ్రహించుట. మరియు విశ్వాసపు శాఖల ఆచరణలో అత్యంత అల్పమైన (తక్కువ స్థాయి కలిగిన) ఆచరణ ఏమిటంటే, ప్రజలు నడిచే దారిలో వారికి హాని కలిగించే దానిని దారి నుంచి తొలగించుట. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసారు: అణకువ, నమ్రత, బిడియము – విశ్వాసపు లక్షణాలలో ఒకటి అని. అణకువ, నమ్రత, బిడియము – విశ్వాసులలో ఉత్తమమైన ఆచరణలు ఆచరించే, మరియు చెడు ఆచరణలను వదిలి వేసే వైఖరిని, దృక్పథాన్ని ప్రొత్సహిస్తాయి.

Hadeeth benefits

  1. ఇందులో విశ్వాసము అనేది అనేక స్థాయిలు కలిగి ఉంటుందని, ఆ స్థాయిలు ఒకదాని కంటే మరొకటి ఉత్తమమైనవిగా ఉంటాయని తెలుస్తున్నది.
  2. విశ్వాసము అంటే మాటలు, చేతలు మరియు నమ్మకము.
  3. అల్లాహ్ సమక్షములో అణకువ, నమ్రత, బిడియము కలిగి ఉండుట అనేది – మననుంచి ఆయన నిషేధించిన వాటిని చూడకుండా ఉండుట అనే లక్షణాన్ని, మరియు ఆయన ఆదేశించిన వాటిని వదలకుండా ఉండుట అనే లక్షణాన్ని కోరుతుంది.
  4. ఈ హదీసులో విశ్వాసమును ఒక సంఖ్యలో సూచించుట – విశ్వాసపు శాఖలు ఆ సంఖ్య వరకే పరిమితం అని అర్థము కాదు. విశ్వాసమును సంఖ్యలో సూచించుట ముఖ్యముగా విశ్వాసము అనేది అనేక విధాలుగా (శాఖలుగా) ఉంటుంది అని తెలియ జేయుట కొరకే. అరబ్బులు ఏదైనా విషయానికి సంబంధించి ఉదాహరణగా ఒక సంఖ్యను పేర్కొంటే, దానికి మించి ఇంక దేనినైనా నిరాకరిస్తారు అని అర్థము కాదు.