- ఇందులో ‘కేవలం అల్లాహ్ మాత్రమే ఏకైక నిజ ఆరాధ్యుడు’ అని మనస్ఫూర్తిగా విశ్వసించే ఏకదైవారాధకులకు తీర్పు దినమున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు ప్రాప్తమవుతుంది అనే నిదర్శనం ఉన్నది.
- ఇక్కడ “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు” అంటే, “కేవలం అల్లాహ్ మాత్రమే నిజ ఆరాధ్యుడు” అనే తమ విశ్వాసంలో స్వచ్ఛత కలిగి ఉన్న ఏకదైవారాధకులు, ఒకవేళ నరకాగ్ని శిక్షకు పాత్రులై ఉంటే, అటువంటి వారు నరకంలో ప్రవేశించకుండా ఉండుటకు; అలాగే అటువంటి వారు ఒకవేళ నరకంలో శిక్ష అనుభవిస్తూ ఉండినట్లయితే, వారిని ఆ శిక్షనుండి బయటకు తీయుటకు గానూ, అల్లాహ్ వద్ద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసే వేడుకోలు అన్నమాట.
- అల్లాహ్ పట్ల “తౌహీద్” (కేవలం అల్లాహ్ ఒక్కడే నిజ ఆరాధ్యుడు అనే కల్మషం లేని విశ్వాసం) యొక్క ఆ పలుకుల ఘనత మరియు మనస్ఫూర్తిగా అంటే షిర్క్ మరియు కపటత్వము అనేవి లేకుండా స్వచ్ఛంగా పలుకబడినపుడు వాటి ప్రభావమూ ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
- “తౌహీద్” యొక్క ఆ పలుకుల ద్వారా ప్రాప్తమయ్యే శుభాలు, ఆ పలుకుల అర్థాన్ని ఆకళింపు చేసుకుని, వాటిపై ఆచరిస్తేనే ప్రాప్తమవుతాయి.
- ఈ హదీసు ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబీగా అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు యొక్క ఘనత మరియు ఙ్ఞాన సముపార్జనలో ఆయన ఉత్సాహం