- ఇందులో అల్లాహ్ ఏకత్వము యొక్క ఘనత ఉన్నది. ఒక విశ్వాసి, కేవలం ఆయనను మాత్రమే ఆరాధిస్తున్న స్థితిలో, ఎవరినీ ఆయనకు సాటి కల్పించకుండా చనిపోయినట్లయితే, అతడు స్వర్గములోనికి ప్రవేశిస్తాడు.
- అలాగే ఇందులో అనేక దేవుళ్లను (బహుదైవాలను) ఆరాధించడంలోని ప్రమాదకరమైన భవిత కూడా ఉన్నది. ఎవరైతే అల్లాహ్ తో పాటు మరెవరినైనా ఆరాధిస్తారో (అంటే వేరే వారిని ఆయనకు సాటిగా నిలబెడతారో) వారు నరకాగ్ని లోనికి ప్రవేశిస్తారు.
- కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించే ఏకదైవారాధకులు ఏవైనా అవిధేయకరమైన పనులకు పాల్బడితే అంటే పాపపు పనులకు పాల్బడితే. వారి భవిత అల్లాహ్ యొక్క ఇచ్ఛపై ఆధారపడి ఉంటుంది. అల్లాహ్ తలుచుకుంటే వారిని క్షమిస్తాడు లేక ఆయన తలుచుకుంటే వారిని శిక్షిస్తాడు. కానీ, చివరికి వారి గమ్యస్థానము స్వర్గమే అవుతుంది.