- ఈ హదీసు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిం సమాజానికి (ఉమ్మత్’కు) చేసిన భవిష్యవాణి; వారు చెప్పినట్లుగానే ఈనాడు జరుగుతున్నది. ఇది వారి ప్రవక్తత్వానికి నిదర్శనము.
- ఒక వ్యక్తికి కలుగబోయే నష్టాన్ని గురించిన ఙ్ఞానము (సమాచారము) మనకు ఉంటే దానిని అతనికి తెలియజేయాలనే అనుమతి ఇందులో ఉన్నది. తద్వారా అతడు దాని కొరకు ముందుగానే సన్నద్ధమై ఉంటాడు.
- ఖుర్’ఆన్ మరియు సున్నత్’లను అంటిపెట్టుకుని ఉండుట – అటువంటి విభేదాల నుండి మరియు అటువంటి పరీక్షల నుండి బయట పడుటకు ఒక మార్గము.
- ఇందులో – పాలకులు అన్యాయానికి పాల్బడే వారైనా, ఒక సహేతుకమైన పద్ధతిలో వారి మాట వినాలని, వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయరాదనే హితబోధ ఉన్నది.
- ఎదురయ్యే అనేక రకాల పరీక్ష సమయాలలో సున్నత్’ను అంటిపెట్టుకుని ఉండి ఙ్ఞానవంతంగా మెలగాలి.
- వ్యక్తి తన విధులను తప్పనిసరిగా నెరవేర్చాలి, అతనిపై ఏ విధమైన అన్యాయం వచ్చి పడినప్పటికీ.
- ఈ హదీసులో (షరియత్ యొక్క) ఒక నియమం తెలుస్తున్నది: వ్యక్తి రెండు హానికరమైన వాటినుండి ఎన్నుకోవలసి వస్తే, తక్కువ హానికరమైన దానిని, మరియు రెండు నష్టపూరితమైన వాటి నుండి ఎన్నుకోవలసి వస్తే తక్కువ నష్టం కలిగించేదానిని ఎన్నుకోవాలి.