- ఈ హదీథులొ వినయంతో ఉండాలనే, ప్రజల పట్ల అహంకారం చూపరాదనే హితబోధ ఉన్నది.
- ఏదైనా విపత్తు ఎదురైనప్పుడు అసంతృప్తి చెందకుండా సహనం వహించడం విధి (వాజిబ్).
- ఈ పనులు “అల్ కుఫ్ర్ అస్’సఘీర్” (చిన్న కుఫ్ర్ – చిన్న అవిశ్వాసం) అనబడతాయి. కుఫ్ర్ యొక్క లక్షణాలలో ఒకదానిని కలిగి ఉన్నవాడు “కాఫిర్” (అవిశ్వాసి) అయిపోడు. “అల్ కుఫ్ర్ అల్ అక్బర్” (పెద్ద కుఫ్ర్ విషయాలు) విషయాలలో దేనికైనా పాల్బడనంత వరకు అతడు కాఫిర్ (అవిశ్వాసి) అయిపోడు.
- ముస్లింల మధ్య విభజనకు దారితీసే అన్ని విషయాలను ఇస్లాం నిషేధిస్తుంది, ఉదాహరణకు: వంశపారంపర్యంపై దాడి మరియు ఇతర విషయాలు వంటివి.