- ఈ హెచ్చరిక గొప్ప నాయకుడు మరియు ఆయన అధికారులు, సామంతులకు మాత్రమే ప్రత్యేకం కాదు. ఇది సాధారణంగా వారికి ఎవరినైతే అప్పగించినాడో వారందరికీ వర్తిస్తుంది.
- ముస్లిముల విషయాలపై అధికారం కలిగిన ప్రతి ఒక్కరి పై విధిగా ఉన్న విషయం ఏమిటంటే, వారు తమ అధికారం క్రింద ఉన్న వారికి సరియైన మార్గదర్శకం చేయాలి, వారికి అప్పగించబడిన బాధ్యతను నిజాయితీగా నిర్వహించడానికి సంపూర్ణంగా కృషి చేయాలి మరియు మోసం, దగా మొదలైన వాటి నుండి జాగ్రత్తగా ఉండాలి.
- ఈ హదీసు ద్వారా - సార్వత్రికంగా ప్రజలందరిపై ఇవ్వబడిన అధికారం కానివ్వండి లేక ప్రత్యేకంగా కొందరిపై ఇవ్వబడిన అధికారం కానివ్వండి; ఆ అధికారం చిన్నది కానివ్వండి లేక పెద్దది కానివ్వండి – దానిని నిజాయితీగా నిర్వహించడం ఎంత ఘనమైన విషయమూ తెలుస్తున్నది.