- వేటకొరకు, పశువుల రక్షణ కొరకు, మరియు పంటపొలాల రక్షణ కొరకు తప్ప కుక్కలను ఉంచుకొనుట హరాం (నిషేధము).
- చిత్రపటాలను ఉంచుకొనుట దైవదూతలను ఇంటిలోనికి ప్రవేశించకుండా దూరంగా ఉంచే చెడు విషయాలలో ఒకటి. చిత్రపటాలు ఇంటిలో ఉండడం అల్లాహ్ యొక్క కరుణనుండి దూరం చేస్తుంది. ఇదే నియమం కుక్కలను ఇంటిలో ఉంచుకుంటే కూడా వర్తిస్తుంది.
- కుక్క మరియు చిత్రపటం ఉన్న ఇళ్ళలోనికి ప్రవేశించని దైవదూతలు ఎవరంటే వారు అల్లాహ్ యొక్క కారుణ్య దూతలు. కానీ రక్షకుడు మరియు మృత్యుదూత వంటి బాధ్యతలు ఉన్న ఇతర దైవదూతల విషయానికొస్తే, వారు ప్రతి ఇంట్లోకి ప్రవేశిస్తారు.
- ఈ హదీథు ద్వారా గోడలపై ఆత్మ కలిగిన సజీవుల చిత్రపటాలను వేళ్ళాడ దీయుట హరాం (నిషేధము) అని తెలియుచున్నది.
- అల్ ఖత్తాబీ ఇలా అన్నారు: కుక్క గానీ, లేక నిషేధించబడిన వాటి చిత్రపటాలు గానీ, అంటే ఉదాహరణకు కుక్క చిత్రపటం, ఉన్న ఇంటిలోనికి దైవదూతలు ప్రవేశించరు. అయితే నిషేధము లేనివి ఏమిటంటే వేటకుక్కలు; పంటపొలాల కుక్కలు; మరియు పశువుల కాపలా కుక్కలు. అలాగే నిషేధించబడని చిత్రపటాలు అంటే ఉదాహరణకు కార్పెట్లపై, తలదిండ్ల గిలాబులపై ముద్రించే లేక చేతిపని ద్వారా గీచే లేక కుట్టబడిన డిజైన్లు, నక్షాలు, ప్రకృతి చిత్రాలు మొదలైనవి. ఇటువంటి నిషేధము కానివి ఇంటిలో ఉండుట దైవదూతల ప్రవేశానికి ఆటంకము కావు.