- కేవలం ‘జనాజా నమాజు’ (మృతుని ఖననం చేయుటకు ముందు ఆచరించబడే నమాజు) తప్ప, స్మశానంలో, మరియు సమాధుల మధ్య, లేదా సమాధుల వైపు నమాజు ఆచరించుట నిషేధము.
- సమాధుల వైపునకు తిరిగి నమాజు ఆచరించుట నిషేధమనేది బహుదైవారాధన యొక్క మూలాన్ని మూసివేయడమే.
- సమాధులకు సంబంధించి ఇస్లాం రెండు విపరీత ఆచరణలను నిషేధిస్తున్నది – సమాధులకు అవసరమైన దాని కంటే ఎక్కువ ప్రాధాన్యత నివ్వడం, అలాగే సమాధుల పట్ల నిర్లక్ష్యంగా, అమర్యాదగా, అవమానకరంగా ప్రవర్తించడం. ఈ రెండూ నిషేధమే.
- (మరొక హదీసులో) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించిన దానిని అనుసరించి ఒక ముస్లిం చనిపోయిన తరువాత కూడా అతని గౌరవం, మాన్యత, పవిత్రత అలాగే నిలిచి ఉంటాయి. (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “చనిపోయిన వాని ఎముకలు విరచడం, బ్రతికి ఉన్న వాని ఎముకలు విరచడముతో సమానము).