- ఈ హదీథు ద్వారా – ఏ ఆరాధనైనా లేక ఏ సత్కార్యమైనా అది కేవలం సర్వోన్నతుడైన అల్లాహ్ కొరకు మాత్రమే ఆచరించుట, అందులో ప్రదర్శనా తత్వము మరియు కపటత్వము లేకుండా వాటి పట్ల జాగ్రత్తగా ఉండుట విధి అని తెలుస్తున్నది.
- అలాగే ఇందులో సహాబాల పట్ల మరియు ఉమ్మత్ పట్ల వారికి సరియైన మార్గదర్శకత్వం చేయుట పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తపన, ఆసక్తి తెలుస్తున్నాయి.
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలు గొప్ప గొప్ప ఉలమాలకు గురువులు. వారి పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధమైన భయాన్ని వెల్లడించారు అంటే, మరి వారి తరువాతి తరాలను గురించి మరింతగా భయపడవలసిన అవసరం ఉన్నది.