- తమ పరిపాలకులు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ కు అవిధేయులు కానంత వరకు, ఆ పరిపాలకులకు విధేయులై ఉండుట విధి.
- నాయకుని విధేయత నుండి ఎవరైతే బయటకు వెళ్ళిపోతాడో, మరియు ముస్లిం సమాజము నుండి వేరుపడిపోతాడో అటువంటి వానికి ఇందులో అత్యంత కఠినమైన హెచ్చరిక ఉన్నది. ఆ స్థితిలో ఒకవేళ అతడు చనిపోతే, జాహిలియ్యహ్ (అఙ్ఞాన కాలపు) విధానములో చనిపోయిన వానితో సమానము అవుతాడు.
- హదీసులో కారణరహిత జాతి లేక తెగ ఉన్మాదముతో యుద్ధానికి దిగుట నిషేధించబడినది.
- ఇందులో ఒడంబడికలను (ఒప్పందాలను) నెరవేర్చుట విధి అనే విషయము తెలుస్తున్నది.
- జమాఅత్’కి విధేయత చూపడం, దానికి కట్టుబడి ఉండడంలో భద్రత, భరోసా, మంచి పరిస్థితులు మొదలైన అనేక శుభాలున్నాయి.
- ‘జాహిలియ్యహ్ కాలపు’ (ఇస్లాంకు పూర్వపు అఙ్ఞాన కాలపు) విధానాలను అనుకరించడం నిషేధించబడినది.
- ఇందులో ముస్లిం సమాజముతో నిలిచి ఉండాలనే ఆదేశము ఉన్నది.