- ఇది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి దైవదౌత్యం యొక్క నిదర్శనాలలో ఒకటి. ఆయన భవిష్యత్తులో జరుగబోయే దానిని గురించి (అగోచర విషయాన్ని గురించి) చెప్పారు. ఇప్పుడు అది వాస్తవమై ఆయన ప్రవచించినట్లుగానే జరుగుతున్నది.
- చెడును, కీడును అనుమతించడానికి, అందులో పాల్గొనడానికి (షరియత్ లో) అనుమతి లేదు. చెడు మరియు కీడులను ఖండించాలి.
- పాలకులు షరియాకు విరుద్ధంగా ఏదైనా చేస్తే, ఆ విషయంలో వారికి విధేయత చూపడం అనుమతించబడలేదు.
- ముస్లిం పాలకునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయరాదు. ఎందుకంటే దాని కారణంగా అశాంతి, అవినీతి, లంచగొండితనం, అరాచకత్వం ప్రబలిపోతాయి, రక్తపాతం, ప్రజలకు రక్షణ లేకపోవడం సాధారణమైపోతాయి. దానికంటే పాలకుని చెడును సహించడం తేలికైనది.
- సలాహ్ (నమాజు స్థాపించుట) అత్యంత గొప్ప విషయం. అదే అవిశ్వాసానికి మరియు విశ్వాసానికి మధ్య తేడా.