- వేటకు లేదా జంతువుల కాపలాకు తప్ప కుక్కను స్వంతానికి కలిగి ఉండడం నిషేధము.
- వెంట అనుసరించని దైవదూతలు ఎవరంటే వారు ‘కారుణ్యపు దైవదూతలు’, రక్షక దైవదూతలు. అల్లాహ్ యొక్క దాసులను వారు వస్తూ పోతూ ఉన్న సమయాలలో ఎప్పుడూ వదిలి వెళ్ళరు.
- గంటను మోగించటం నిషేధించడం జరిగింది, ఎందుకంటే అది షైతాను వాద్యాలలో ఒకటి, మరియు యూదులు గంట వాడడాన్ని పోలినట్లుగా ఉంటుంది.
- దైవదూతలను దూరంగా ఉంచే ప్రతి విషయం నుండి దూరంగా ఉండే విషయం లో ప్రతి ముస్లిం జాగ్రత్తగా ఉండాలి