- ఇందులో సున్నత్ ను అంటిపెట్టుకుని ఉండడం మరియు సున్నత్ ను అనుసరించడం యొక్క ప్రాధాన్యత తెలుస్తున్నది.
- ధార్మిక ప్రసంగాలు వినడం పట్ల శ్రద్ధ వహించాలి. వాటి వలన హృదయాలు మృదువుగా మారతాయి.
- ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత (షరియత్ మార్గదర్శనములో) సన్మార్గ గాములైన ఖలీఫాలను; అంటే అబూ బకర్ అస్సిద్దీఖ్, ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్, ఉథ్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ మరియు అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హుమ్ అజ్మయీన్ ల సున్నత్ ను అనుసరించాలనే ఆదేశం ఉన్నది.
- ధర్మములో కొత్తగా ప్రవేశపెట్టబడే విషయాల పట్ల నిషేధం కనిపిస్తున్నది; ఎందుకంటే (ధర్మములో) కొత్తగా ప్రవేశపెట్టబడే ప్రతి విషయమూ మార్గభ్రష్ఠత్వమే అనే హెచ్చరిక ఉన్నది.
- విశ్వాసులపై అధికారిగా, లేక పాలకునిగా ఎవరు నియమించబడినా అవిధేయత చూపకుండా, వారి మాట వినాలి, వారిని అనుసరించాలి.
- అన్ని సమయాలలోనూ, అన్ని విషయాలలోనూ అల్లాహ్ పట్ల తఖ్వా (భయభక్తులు) కలిగి ఉండడం యొక్క ప్రాధాన్యత కనిపిస్తున్నది.
- ఉమ్మత్ లో విబేధాలు, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అవి ప్రస్ఫుటమైనప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ వైపునకు మరియు ఖులాఫా అర్రాషిదీన్’ల యొక్క సున్నత్ వైపునకు మరలడం విధి.