/ “మనిషి చనిపోయినపుడు అతని ఆచరణలు ముగిసిపోతాయి; మూడు (ఆచరణలు) తప్ప: కొనసాగుతూ ఉండే దానము; ప్రయోజనకరమైన ఙ్ఞానము; అతని కొరకు దుఆ చేసే ధార్మికుడైన కుమారుడు.”...

“మనిషి చనిపోయినపుడు అతని ఆచరణలు ముగిసిపోతాయి; మూడు (ఆచరణలు) తప్ప: కొనసాగుతూ ఉండే దానము; ప్రయోజనకరమైన ఙ్ఞానము; అతని కొరకు దుఆ చేసే ధార్మికుడైన కుమారుడు.”...

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మనిషి చనిపోయినపుడు అతని ఆచరణలు ముగిసిపోతాయి; మూడు (ఆచరణలు) తప్ప: కొనసాగుతూ ఉండే దానము; ప్రయోజనకరమైన ఙ్ఞానము; అతని కొరకు దుఆ చేసే ధార్మికుడైన కుమారుడు.”
దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసినారు: చనిపోయిన వ్యక్తి యొక్క ఆచరణలు అతని మృత్యువుతో ఆగిపోతాయి; అతని మృత్యువు తరువాత అతడు జీవించి ఉండగా చేసిన తన మంచిపనుల పుణ్యాన్ని పొందడు; కేవలం ఈ మూడు పనుల విషయం లో తప్ప. ఎందుకంటే ఈ మూడు పనులకు కారణం అతడు కనుక: మొదటిది: నిరంతరత మరియు శాశ్వతమైన ప్రతిఫలం కలిగిన దాతృత్వం. ఉదాహరణకు: ధర్మం కొరకు సంపదను అర్పణం చేయడం (ధర్మార్పణం); మస్జిదులను నిర్మించడం; బావులను త్రవ్వించడం మొదలైన ఇటువంటి ఆచరణలు. రెండవది: ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఙ్ఞానము; ఉదాహరణకు ప్రజలకు ప్రయోజనం కలిగించే ఙ్ఞానవంతమైన రచనలు చేయడం; లేదా ఙ్ఞానవంతమైన విషయాలను బోధించుట; ఆ విధంగా నేర్చుకున్న వ్యక్తి దానిని మరొకరికి నేర్పుట. ఆ విధంగా తాను చనిపోయిన తరువాత కూడా ఆ ఙ్ఞానము ఆ విధంగా వ్యాప్తి చెందుతూ ఉండుట. మూడవది: తన తల్లిదండ్రుల కోసం ప్రార్థించే (దుఆ చేసే) నీతిమంతుడైన, విశ్వాసి అయిన కుమారుడు.

Hadeeth benefits

  1. మరణం తర్వాత ఒక వ్యక్తికి చేరుతూ ఉండే పుణ్యఫలం ఈ విధంగా ఉంటుందని ధర్మపండితులు ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు:
  2. కొనసాగుతూ ఉండే దాతృత్వం, ప్రయోజనకరమైన జ్ఞానం, దుఆ (ప్రార్థన) మరియు ఇతర హదీథ్‌లలో: హజ్ గురించి కూడా ప్రస్తావించబడింది.
  3. ఈ మూడు ఈ హదీసులో ప్రత్యేకంగా ప్రస్తావించబడినవి, ఎందుకంటే అవి మంచితనానికి పునాదులు, మరియు ధర్మవంతులైన వ్యక్తులు, వారి తర్వాత వీటిలో ఎక్కువ భాగం కొనసాగాలని భావిస్తారు.
  4. ప్రయోజనకరమైన ప్రతి జ్ఞానం అతనికి ప్రతిఫలాన్ని తెస్తుంది, కానీ వాటిలో అగ్రస్థానంలో మరియు శిఖరాగ్రంలో ఇస్లామీయ జ్ఞానం మరియు దానికి మద్దతు ఇచ్చే శాస్త్రాలు ఉన్నాయి.
  5. జ్ఞానం ఈ మూడింటిలో అత్యంత ప్రయోజనకరమైనది, ఎందుకంటే దానిని నేర్చుకునే వ్యక్తికి జ్ఞానం ప్రయోజనం చేకూరుస్తుంది. జ్ఞానము అంటే అందులో “షరియాను” భద్రపరచడం కూడా ఉంది, ఇది సాధారణంగా ప్రజలందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. ఙ్ఞానము మరింత సమగ్రమైనది మరియు సాధారణమైనది ఎందుకంటే ఇది మీ జీవితంలో ఉన్న ఙ్ఞానము నుండి నేర్చుకోబడుతుంది, మరియు అలా నేర్పిన ఙ్ఞానము మీ మరణం తరువాత కూడా ఉంటుంది.
  6. ఈ హదీథ్‌లో పిల్లలను నీతిమంతులైన పిల్లలుగా పెంచాలని ప్రోత్సాహం ఉంది; పరలోకంలో తమ తల్లిదండ్రులకు ప్రయోజనం చేకూర్చేది వారే, మరియు ఆ ప్రయోజనాలలో ఒకటి తల్లిదండ్రుల కొరకు దుఆ చేయడం (ప్రార్థించడం).
  7. ఈ హదీథ్‌లో తల్లిదండ్రుల మరణానంతరం వారి పట్ల దయ చూపమని ప్రోత్సాహం ఉంది, ఇది కూడా ఒక రకమైన ధర్మపరాయణత్వం, దాని నుండి బిడ్డ ప్రయోజనం పొందుతాడు.
  8. దుఆ (ప్రార్థన) అనేది పిల్లల నుండి కాకపోయినా మరణించిన వ్యక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది, కానీ ఇందులో సంతానం ప్రత్యేకంగా ప్రస్తావించబడింది, ఎందుకంటే అతను సాధారణంగా మరణించే వరకు ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాడు.