- ఇందులో అల్లాహ్ మార్గములో ఖర్చు చేయుటలోని ఔన్నత్యము గురించి హితబోధ ఉన్నది.
- (అల్లాహ్ మార్గములో) దానధర్మాలలో ఖర్చు చేయుట అనేది - వ్యక్తి యొక్క జీవనోపాధిలో సమృద్ధిగా అల్లాహ్ యొక్క ఆశీర్వాదము, అందులో అనేక రెట్లు వృద్ధి మరియు దాసుడు చేసిన ఖర్చు కు ప్రతిగా అల్లాహ్ అతనికి మరింత ప్రసాదించుట – వీటన్నిటి సాధనకు ఒక కారకము అవుతుంది.
- ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తరఫున అల్లాహ్ యొక్క వాక్కులను ఉచ్చరిస్తున్నారు. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఏదైనా హదీసులో అల్లాహ్ జనులను సంబోధిస్తున్నట్లుగా ఉంటే అలాంటి హదీసును “హదీసుల్ ఖుద్సీ” అంటారు. ‘హదీసుల్ ఖుద్సీలోని’ పదములు మరియు అర్థము అల్లాహ్ తరఫు నుండి అయి ఉంటాయి. అయితే ‘హదీసుల్ ఖుద్సీలో’ పదములు మరియు అర్థము అల్లాహ్ తరఫు నుండి అయినప్పటికీ ఖుర్’ఆన్ మరియు హదీసుల్ ఖుద్సీ రెండూ సమానము కావు. ఖుర్’ఆన్ పఠనము అనేది ఒక ఆరాధన, ఖుర్’ఆన్ పఠించుట కొరకు ‘వుజూ’ చేయుట (నిర్ణీత శరీర భాగాలను ఇస్లామీయ పద్ధతిలో నీటితో శుభ్రపరుచుకొనుట), ఖుర్’ఆన్ లో అవిశ్వాసులకు చేయబడిన సవాళ్ళు, మరియు ఖుర్’ఆన్ స్వతహాగా ఒక అద్భుతం కావడం – ఈ విషయాలన్నీ ఖుర్’ఆన్ ను హదీసుల్ ఖుద్సీ నుండి వేరు పరుస్తాయి.