- ఇమాం యొక్క జమా ప్రసంగాన్ని వింటున్న సమయములో చెడును ఖండించడం, సలాంకు జవాబు చెప్పడం, ఎవరైనా తుమ్మి ‘అల్-హందులిల్లాహ్’ అని పలికితే దానికి జావాబు పదాలు పలకడం ఇవన్నీ కూడా నిషేధమే.
- ఈ నిషేధానికి ఉన్న ఒకే ఒక మినహాయింపు ఏమిటంటే, ఎవరైనా ఇమాంతో మాట్లాడ దలుచుకున్నా లేక ఇమాం (తన ఎదుట హాజరుగా ఉన్నవారిలో) ఎవరితోనైనా మాట్లాడ దలుచుకున్నా – అలా చేయవచ్చు.
- జుమా దినమునాడు ఇవ్వబడే రెండు ఖుత్బాల నడుమ ఉండే విరామ సమయములో, అవసరమైతే మాట్లాడవచ్చు.
- ఖుత్బాలో ఇమాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరును ప్రస్తావించినట్లయితే ‘సల్లల్లాహు అలైహి వసల్లం’ అని పలుకవచ్చును; అయితే ఉఛ్ఛ స్వరములో కాకుండా నెమ్మదిగా లోలోపలే అనాలి. ఇదే నియమం ఇమాం దుఆ చేస్తున్నట్లయితే ‘ఆమీన్’ అని పలకడానికి కూడా వర్తిస్తుంది.