- ‘తహియ్యతుల్ మస్జిదు’ గా మస్జిదులో కూర్చునే ముందు రెండు రకాతుల నమాజును ఆచరించుట అభిలషణీయము (ముస్తహబ్).
- ఈ నమాజు, మస్జిదులోనికి (నమాజు కొరకైనా, లేక ఏ ఇతర పని కొరకైనా) ప్రవేశించి, మస్జిదులోపల కూర్చోదలచిన వారికి మాత్రమే వర్తిస్తుంది. అలాగాక మస్జిదులోనికి ప్రవేశించి, కొద్ది సేపటిలో కూర్చోకుండానే బయటకు వెళ్ళిపోయే వారికి వర్తించదు.
- భక్తుడు మస్జిదులోనికి ప్రవేశించినపుడు, ప్రజలు మరియు ఇమాము సామూహిక నమాజు ప్రారంభించేసి ఉండినట్లయితే, అతడు తహియ్యతుల్ మస్జిదు నమాజు ఆచరించవలసిన అవసరం లేదు. (అతడు నేరుగా జమాతులోనికి ప్రవేశించాలి).