- ప్రతి అదాన్ మరియు ఇఖామత్’ల మధ్య నమాజు ఆచరించుట అభిలషణీయం.
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మాటను పునరావృతం చేయడంలో వారి మార్గదర్శకం ఉన్నది - అక్కడ ఉన్నవారు ఆ విషయాన్ని వినేలా చేయడం మరియు ఆయన చెప్పే దాని యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం ఉద్దేశ్యం.
- హదీథులో ‘రెండు పిలుపులు’ అనే మాటలకు అర్థం: అదాన్ మరియు ఇఖామత్. అరబీ భాషలో ఈ విధంగా జంట పదాలను వాడడం లో ముఖ్య ఉద్దేశ్యం వాటిని నొక్కి చెప్పడం, వాటి ప్రాముఖ్యతను తెలియజేయడం. ఉదాహరణకు “అల్’ఖమరైన్” (రెండు చంద్రుళ్ళు – సూర్యుడు మరియు చంద్రుడు); “అల్’ఉమరైన్” (ఇద్దరు ఉమర్’లు – అబూబక్ర్ (రదియల్లాహు అన్హు) మరియు ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు).
- “అల్ అదాన్” ఇది నమాజు యొక్క సమయం మొదలైందని ప్రకటించడం; “అల్ ఇఖామత్” సామూహిక నమాజు ప్రారంభమవుతున్నది అని ప్రకటించడం.