/ “విధిగా ఆచరించవలసిన ప్రతి సలాహ్ తరువాత ఎవరైతే “ఆయతుల్ కుర్సీ” పఠిస్తాడో, మరణం తప్ప, అతడిని స్వర్గములో ప్రవేశించడం నుండి ఏమీ నిషేధించదు.”...

“విధిగా ఆచరించవలసిన ప్రతి సలాహ్ తరువాత ఎవరైతే “ఆయతుల్ కుర్సీ” పఠిస్తాడో, మరణం తప్ప, అతడిని స్వర్గములో ప్రవేశించడం నుండి ఏమీ నిషేధించదు.”...

అబూ ఉమామహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “విధిగా ఆచరించవలసిన ప్రతి సలాహ్ తరువాత ఎవరైతే “ఆయతుల్ కుర్సీ” పఠిస్తాడో, మరణం తప్ప, అతడిని స్వర్గములో ప్రవేశించడం నుండి ఏమీ నిషేధించదు.”

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసినారు: ఎవరైతే, విధిగా ఆచరించవలసిన ప్రతి సలాహ్ తరువాత (ప్రతి ఫర్జ్ నమాజు తరువాత), ఆయతుల్ కుర్సీ పఠిస్తాడో, అతడు స్వర్గములో ప్రవేశించడం నుండి చావు తప్ప మరింకేమీ అడ్డుకోలేదు. ఆ ఆయతు సూరహ్ అల్ బఖరహ్ లో ఉంది. అందులో అల్లాహ్ ఇలా అంటున్నాడు: {“అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం, లా త’ఖుజుహు, సినతు వలా నౌం, లహు మా ఫిస్సమావాతి వమా ఫిల్ అర్జ్, మన్’జల్లజీ యష్’ఫఉ, ఇందహు, ఇల్లా బిఇజ్’నిహి, యా’లము మాబైన ఐదీహిమ్, వమా ఖల్ఫహుమ్, వలా యుహీతూన బి షైఇమ్ మిన్ ఇల్మిహి, ఇల్లా బిమా షాఅ, వసిఅ కుర్సియ్యుహు స్సమావాతి వల్ అర్జ్, వలా యఊదుహు హిఫ్జుహుమా, వహువల్ అలియ్యుల్ అజీమ్”} [అల్లాహ్‌! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు, ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో – ఆయన అనుజ్ఞ లేకుండా – సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందు ఉన్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు.] (సూరహ్ అల్ బఖరహ్ 2:255) (సూరహ్ అల్ బఖరహ్ 2:255)

Hadeeth benefits

  1. ఈ హదీసులో అతి ఉత్కృష్టమైన ఆయతు యొక్క ఘనత తెలియుచున్నది; ఈ ఆయతులో అల్లాహ్ యొక్క అందమైన పేర్లు మరియు ఆయన మహోన్నతమైన గుణగణాలు ఉన్నాయి.
  2. విధిగా ఆచరించవలసిన ప్రతి సలాహ్ తరువాత (ప్రతి ఫర్జ్ నమాజు తరువాత) ఈ మహోన్నతమైన ఆయతు పఠించాలని సిఫారసు చేయబడుతున్నది.
  3. స్వర్గములో ప్రవేశించడానికి సత్కార్యాలు చేయుట ఒక కారణం అవుతుంది.