వివరణ
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ‘విధిగా ఆచరించవలసిన ప్రతి నమాజు తరువాత ఎవరైతే ఈ క్రింది విధంగా ఉచ్చారిస్తారో:
“సుబ్’హానల్లాహ్” అని ముప్ఫైమూడు సార్లు, అంటే దాని అర్థం “అల్లాహ్ లోపాలకు అతీతమైన వాడు” అని;
అలాగే “అల్’హమ్దులిల్లాహ్” అని ముప్ఫైమూడు సార్లు, అంటే దాని అర్థం “అన్ని రకాల స్తుతులు, ప్రశంసలు అన్నీ కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే” అని; అంటే ఆయనపై ప్రేమతో, ఆయనను మహిమ పరచడం, దానితో పాటు ఆయన యొక్క పరిపూర్ణ గుణ,లక్షణాలతో ఆయనను స్తుతించడం.
అలాగే “అల్లాహు అక్బర్” అని ముప్ఫైమూడు సార్లు, అంటే దాని అర్థం అల్లాహ్ అన్నిటి కంటే మరియు అందరి కంటే గొప్పవాడు మరియు ఘనమైన వాడు, దివ్యమైనవాడు అని అర్థం – అలా ఉచ్ఛరించి;
వాటిని ఈ పదాలతో వాటి సంఖ్య మొత్తం వంద పూర్తి అయ్యేలా చేయాలి: “లాఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లాషరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హందు, వహువ అలాకుల్లి షైఇన్ ఖదీర్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన అద్వితీయుడు (ఏకైకుడు); తనకు సమానం గానీ, సాటి గానీ, భాగస్వాములు గానీ ఎవరూ లేని వాడు, విశ్వ సామ్రాజ్యం ఆయనదే, ప్రశంసలు, పొగడ్తలు అన్నీ ఆయనకే చెందుతాయి, ఆయన ప్రతి విషయంపై అధికారం గలవాడు) – అంటే దాని అర్థము: ఏకైకుడూ, తన ప్రభుతలో సాటి గానీ, భాగస్వామి గానీ ఎవరూ లేని వాడు అయిన అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ఆయనే లోపాలకు అతీతుడు, పరమ పవిత్రుడు, మరియు విశ్వసామ్రాజ్యంపై సంపూర్ణ ఆధిపత్యం గలవాడు. మరియు ఆయనే అందరికంటే ఎక్కువగా ప్రశంసలు, ప్రేమ మరియు గౌరవాలకు అర్హుడు. ఆయన సర్వశక్తిమంతుడు, సమర్థుడు మరియు ఏ విషయామూ ఆయనను అశక్తుని, నిస్సహాయుని చేయలేదు; ఆయన శక్తిని అధిగమించగలిగినది ఏదీ లేదు.
ఎవరైతే అలా పలికి వంద పూర్తి చేస్తారో, అతడి పాపాలన్నీ తుడిచివేయబడతాయి, అతడు క్షమించబడతాడు; అతడి పాపాలు సముద్రం ఉప్పొంగినప్పుడు మరియు ఉధృతంగా ఉన్నప్పుడు పైకి లేచే తెల్లని నురుగ లాగా ఎంత అధికంగా ఉన్నప్పటికీ.