“(నమాజులో) రెండు సజ్దాల నడుమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహుమ్మఘ్’ఫిర్లీ, వర్హమ్’నీ, వఆఫినీ, వహ్’దినీ, వర్జుఖ్’నీ” (ఓ అల్లాహ్ నాకు క్షమాభిక్ష ప్రసాదించు, నాపై కరుణ చూపు, నాకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, శ్రేయస్సును ప్రసాదించు, నాకు మా...
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం : “(నమాజులో) రెండు సజ్దాల నడుమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహుమ్మఘ్’ఫిర్లీ, వర్హమ్’నీ, వఆఫినీ, వహ్’దినీ, వర్జుఖ్’నీ” (ఓ అల్లాహ్ నాకు క్షమాభిక్ష ప్రసాదించు, నాపై కరుణ చూపు, నాకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, శ్రేయస్సును ప్రసాదించు, నాకు మార్గదర్శకాన్ని ప్రసాదించు మరియు నాకు ఉపాధిని ప్రసాదించు) అని పలికేవారు.”
వివరణ
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఐదు దుఆ లను నమాజులో రెండు సజ్దాల నడుమ పలికేవారు – ఈ దుఆలలో ఉన్న విషయాలు ప్రతి ముస్లింకి అత్యంత అవసరమైనవి. ఈ దుఆలలో ఈ ప్రపంచ జీవితానికి సంబంధించి మరియు పరలోక జీవితానికి సంబంధించిన మంచి విషయాల ప్రస్తావన ఉన్నది. ఉదాహరణకు పాపముల నుండి క్షమాభిక్ష కొరకు వేడుకొనుట, వాటిని కప్పివేయుట కొరకు మరియు వాటినుండి మరలిపోవుట కొరకు వేడుకొనుట, అల్లాహ్ యొక్క కరుణ కొరకు వేడుకొనుట, శ్రేయస్సు కొరకు వేడుకొనుట – అంటే అనుమానాలు, సందేహాలనుండి స్వేచ్ఛ కొరకు, కోరికలు, వాంఛలనుండి స్వేచ్ఛ కొరకు, అనారోగ్యము పాలు కావడం నుండి స్వేచ్ఛ కొరకు మరియు వ్యాధులనుండి స్వేచ్ఛ కొరకు వేడుకొనుట, అలాగే ఉపాధి కొరకు వేడుకొనుట – అంటే ఈమాన్ కలిగి ఉండుట ద్వారా, ఙ్ఞానము ద్వారా, సత్కార్యములు ఆచరించుట ద్వారా మరియు స్వచ్చమైన సంపాదన ద్వారా ఉపాధి ప్రసాదించమని వేడుకొనుట.
Hadeeth benefits
రెండు సజ్దాల నడుమ మూర్చుని ఈ దుఆలు పలుకుట షరియత్ లోని విషయమే అనే విషయం అర్థమవుతున్నది.
ఈ దుఆల యొక్క ఘనత – వాటిలో ఈ ప్రాపంచిక జీవితపు మరియు పరలోక జీవితపు మంచి విషయాలన్నీ కలిగి ఉండడమే.
Share
Use the QR code to easily share the message of Islam with others