- ఈ హదీసులో, నమాజులో ఉన్న వ్యక్తి రుకూ స్థితి నుండి పైకి లేచుట కొరకు తన తల పైకి ఎత్తినపుడు పలుకవలసిన అభిలషణీయమైన పదాలను గురించి తెలుపబడినది.
- ఇందులో రుకూ స్థితి నుంచి పైకి లేచునపుడు, మరియు పూర్తిగా లేచిన తరువాత ప్రశాంతత, స్థిరత్వం, నిశ్చలత్వం తొందరపాటు లేని తనం, ఉండాలని ఈ షరియత్ ఆదేశములో కనిపిస్తున్నది. ఎందుకంటే ప్రశాంతత, తొందరపాటు లేని తనం లేకపోతే దాసుడు ఈ అజ్’కార్’లను (స్తోత్రపు వాక్యాలను) పూర్తిగా పలుకలేడు.
- అల్లాహ్ ను స్తుతించుట, ఆయనకు చెందిన స్తోత్రములను పఠించుట, పలుకుట ఫర్జ్, సున్నత్, నఫీల్ అనే భేదము లేకుండా అన్ని సలాహ్ (నమాజు) లలోనూ చేయవచ్చును.