- ఇందులో – జమాఅత్’తో (సామూహిక) నమాజు ఆచరించుటను వదిలివేయడం ఎంత భయంకరమైన విషయమో తెలియుచున్నది.
- కపట విశ్వాసులు తమ కపటత్వము మరియు పేరుప్రతిష్ఠలు తప్ప తమ ఆరాధనల గురించి ఎపుడూ సంకల్పించరు. కనుక వారు నమాజు కొరకు రారు - ప్రజలు వారిని చూస్తున్నపుడు తప్ప.
- ఫజ్ర్ మరియు ఇషా నమాజులు జమాఅత్’తో ఆచరించుట యొక్క ప్రతిఫలము చాలా గొప్పది, వాటి కొరకు ప్రాకుతూ రావలసి వచ్చినా అలా వచ్చి ఆచరించ దగిన ప్రాముఖ్యత కలిగిన నమాజులు అవి.
- ఇషా మరియు ఫజ్ర్ నమాజులను సంరక్షించుట (వదలకుండా ఆచరించుట) కపటత్వము నుండి మనలను కాపాడుతుంది. మరియు వాటిని వదిలివేయడం కపట విశ్వాసుల లక్షణాలలో ఒకటిగా పరిగణించబడింది.