/ “ఎవరైనా సలాహ్ ఆచరించవలసి ఉందన్న విషయాన్ని మరిచిపోయినట్లయితే, అతడు తనకు గుర్తుకు వచ్చిన వెంటనే ఆ సలాహ్ ను ఆచరించాలి. ఇది తప్ప దీనికి పరిహారము లేదు...

“ఎవరైనా సలాహ్ ఆచరించవలసి ఉందన్న విషయాన్ని మరిచిపోయినట్లయితే, అతడు తనకు గుర్తుకు వచ్చిన వెంటనే ఆ సలాహ్ ను ఆచరించాలి. ఇది తప్ప దీనికి పరిహారము లేదు...

అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైనా సలాహ్ ఆచరించవలసి ఉందన్న విషయాన్ని మరిచిపోయినట్లయితే, అతడు తనకు గుర్తుకు వచ్చిన వెంటనే ఆ సలాహ్ ను ఆచరించాలి. ఇది తప్ప దీనికి పరిహారము లేదు. {وَأَقِمِ الصَّلاةَ لِذِكْرِي} [طه: 14] (మరియు నన్ను స్మరించుట కొరకు నమా'జ్‌ను స్థాపించు.) [సూరహ్ తాహా 20:14):”
ముత్తఫిఖ్ అలైహి

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఎవరైనా విధిగా ఆచరించవలసిన నమాజులలో ఏదైనా నమాజును దాని సమయం దాటిపోయేంత వరకు ఆచరించుట మరిచిపోతే, అతడు గుర్తుకు వచ్చిన వెంటనే ఆ నమాజును (ఖజా నమాజుగా) ఆచరించుటకు ఉపక్రమించాలి. ఆ విధంగా పూర్తి చేయకుండా మిగిలి పోయిన నమాజును గుర్తుకు వచ్చిన వెంటనే ఆచరించుట తప్ప, ఒక ముస్లిము ఆ నమాజును సమయం మించిపోయేంత వరకు మరిచిపోవటం (అలక్ష్యము) వలన జరిగిన పాపము అతని నుండి తొలగిపోవుట, లేదా కప్పివేయబడుట జరుగదు. అల్లాహ్ దివ్య ఖుర్’ఆన్ లో ఇలా ఆదేశించినాడు: {… وَأَقِمِ ٱلصَّلَوٰةَ لِذِكْرِىٓ} (మరియు నన్ను స్మరించుట కొరకు నమా'జ్‌ను స్థాపించు.) [సూరహ్ తాహా 20:14): అంటే, విధిగా ఆచరించవలసిన నమాజులలో దేనినైనా ఆచరించుట మరిచిపోతే, గుర్తుకు వచ్చిన వెంటనే అల్లాహ్ ను స్మరించుటకొరకు ఆ నమాజు స్థాపించుట కూడా విధి అని అర్థము.

Hadeeth benefits

  1. ఈ హదీసులో సలాహ్ (నమాజు) యొక్క ప్రాధాన్యత గురించి తెలుస్తున్నది. అలాగే నమాజు ఆచరించుట పట్ల అలసత్వం ప్రదర్శించి, సమయం గడిచిపోయిన పిదప దానిని ఆచరించి ఎలాగోలా పూర్తిచేసుకొనుట ఎంతమాత్రమూ తగదు అనే విషయాలు తెలుస్తున్నాయి.
  2. ఏ సముచిత కారణమూ లేకుండా విధిగా ఆచరించవలసిన ఏ నమాజునైనా ఉద్దేశ్యపూర్వకంగా దాని నిర్ధారిత సమయం గడిచిపోయేంత వరకు ఆలస్యం చేయుటకు (షరియత్’లో) అనుమతి లేదు.
  3. విధిగా ఆచరించవలసిన నమాజును మరిచిపోయిన వారెవరైనా గుర్తుకు వచ్చిన వెంటనే ఆ నమాజును పూర్తి చేయాలి, అలాగే గాఢనిద్ర వలన పూర్తి చేయలేక పోయిన నమాజును అతడు నిద్ర నుంచి లేచిన వెంటనే పూర్తి చేయాలి.
  4. (దినములో) ఆచరించకుండా ఉండిపోయిన నమాజులను వెంటనే ఆచరించుట విధి.