- ఈ హదీథులో రాత్రి చివరి భాగములో అల్లాహ్’ను ఆరాధించమనే హితబోధ ఉన్నది.
- ఇందులో ఘనత కలిగిన కొన్ని ప్రత్యేక సమయాలు ఉన్నాయని, ఆ సమయాలలో సలాహ్ (నమాజు) ఆచరించుట, అల్లాహ్’ను స్మరించుట, ఆయనను వేడుకొనుట చేయవలెనని తెలుస్తున్నది.
- 'మీర్క్' అనే ఆయన ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటలలో వ్యత్యాసం ఉన్నది: దానిని అర్థం చేసుకోవాలి. ఈ హదీథులో “ప్రభువైన అల్లాహ్ తన దాసునికి అతి చేరువలో ఉంటాడు...” అనే మాటలకు; మరొక హదీథులో “సజ్దాహ్ స్థితిలో దాసుడు తన ప్రభువుకు అతి చేరువలో ఉంటాడు” అని అనే మాటలకు అర్థం ఏమిటంటే – రాత్రి చివరి మూడవ భాగములో అల్లాహ్ తన దాసునికి అతి చేరువలో ఉంటాడు అని, దాసుడు తన ప్రభువుకు అతి చేరువలో ఉండే స్థితి ఏమిటంటే అతడు సలాహ్ (నమాజు)లో సజ్దాహ్ చేస్తున్న స్థితి.