- ఏడు శరీర భాగాలపై సజ్దాహ్ చేయుట విధి (వాజిబ్).
- సజ్దాహ్ చేయునపుడు బట్టలను మరియు తల వెంట్రుకలను సరి చేసుకొనుట, లేక పైకి దోపుకొనుట, మొదలైనవి మక్రూహ్ చర్యలు (అయిష్టమైన చర్యలు).
- సలాహ్ ఆచరిస్తున్న వ్యక్తి సజ్దాహ్ చేయునపుడు ప్రశాంతంగా ఏడు శరీర భాగాలు నేలకు ఆనించి సజ్దాహ్ చేయాలి. సజ్దాహ్ స్థితిలో పలుకవలసిన దుఆలు, స్తుతి వాక్యాలు పలుకుట పూర్తిగా అయిపోయేంత వరకు ఏడు శరీర భాగాలు నేలకు ఆని ఉండేలా చేయుట తప్పనిసరి.
- సజ్దాహ్ చేయునపుడు తల వెంట్రుకలను పైకి దోపుకోరాదని, అలాగే వదిలివేయాలనే ఆదేశము కేవలం పురుషులకొరకు మాత్రమే, స్త్రీలకు కాదు. ఎందుకంటే సలాహ్ ఆచరించునపుడు స్త్రీలు తల నుండి మొదలుకుని పాదాల వరకు తమను తాము పూర్తిగా కప్పుకుని ఉండాలని ఆదేశించబడింది.