- సూరతుల్ ఫాతిహా పఠించగలిగి ఉండీ, దానిని పఠించకుండా ఇంకా ఏ సూరహ్ పఠించినా అది సరిపోదు, ఆమోదయోగ్యం కాదు.
- ఏ రకాతులో నైనా, ఉద్దేశ్యపూర్వకంగా లేక అజ్ఞానం కొద్దీ, లేక మరిచిపోయి అయినా సూరతుల్ ఫాతిహా పఠించనట్లయితే ఆ రకాతు సంపూర్ణము కాదు (లోపభూయిష్టమైనది). ఎందుకంటే అది ఒక రుక్న్ (మూలస్థంభము); మూలస్థంభాలు ఎన్నడూ పాటించకుండా వదిలివేయబడవు.
- అయితే ఇమాం రుకూ స్థితిలో ఉండగా సలాహ్’లో చేరిన వ్యక్తికి సూరతుల్ ఫాతిహ పఠించే నియమం వర్తించదు.